Badi | రోడ్డు బాధలు పట్టించుకోరా..?
Badi | రోడ్డు బాధలు పట్టించుకోరా..?
జాతీయ రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో…!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : బేల (Bela) మండలం బాది (Badi) నుండి సిరిసన్న వరకు రహదారి అస్తవ్యస్తంగా మారి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, పాలకులు అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిరిసన్న జాతీయ రహదారిపై రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు తరలివచ్చి బైఠాయించారు.
అధికారుల తీరును ఎండగట్టారు. గత 15 ఏళ్ల క్రితం వేసిన బీటీ రోడ్డు పూర్తిగా కంకర తేలి నడవడానికి నరకయాతన పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. కనీసం మరమ్మత్తులు కూడా చేపట్టడం లేదని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. సిరసన్న, బాది, జామిని గ్రామాల వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ (demand) చేశారు. గంటన్నర సేపు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బేల పోలీసులు (police) వచ్చి సముదాయించి వారిని పంపించారు. ఒకవేళ 15 రోజుల్లో గా రోడ్డు గురించి అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
