దివిస్ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో దివిస్ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
రూ.98.50 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్‌తో కలిసి పరిశ్రమ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్ ప్రారంభించారు. అదేవిధంగా రూ.21.60 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా మండలి భవనాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి దివిస్ పరిశ్రమ యాజమాన్యం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఉప సర్పంచ్ వలందాసు మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ముద్ధం సుమిత్ర సత్తయ్య గౌడ్, దివిస్ లైజనింగ్ ఆఫీసర్ బి. కిషోర్ కుమార్, సీనియర్ ఆఫీసర్ కె. శివప్రసాద్, దివిస్ ప్రతినిధులు బి. గోపి, జె. శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
