ప్రాంత అభివృద్ధికి అంకితభావంతో సేవలు

ప్రాంత అభివృద్ధికి అంకితభావంతో సేవలు

  • ఇంజనీరింగ్ రంగంలో చిరస్మరణీయ కీర్తి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించడమే జీవిత ధ్యేయంగా భావించిన ప్రముఖ ఇంజనీర్‌, గుండ్రేవుల రూపకర్త, రాయలసీమ నీటి ప్రాజెక్టుల శిల్పి ఎం. సుబ్బరాయుడు(M. Subbarayadu) (రిటైర్డ్ ఇంజనీర్‌) మంగళవారం ఉదయం 8.10 గంటలకు కర్నూలులో కన్నుమూశారు.

ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సహచరులు, ఇంజనీర్‌ వర్గాలు(Engineer categories), రాయలసీమలోని పలు ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సుబ్బరాయుడు రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖలో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ చేశారు. అయితే పదవీ విరమణ తర్వాత కూడా ఆయన ఆగలేదు. రాయలసీమ ప్రాంతం నీటివనరుల పరంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. గుండ్రేవు ప్రాజెక్ట్‌(Gundrevu Project)తో పాటు రాయలసీమ అంతటా సాగునీటి సౌకర్యాల విస్తరణకు అంకితభావంతో కృషి చేశారు. ఆయన ఆలోచనలు, సాంకేతిక పథకాలు అనేకం ప్రస్తుతం రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తున్నాయి. వీటితోపాటు అనేక నూతన ప్రాజెక్టులకు పునాది వేశాయి.

రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి(to solve the water problem) ఆయన చేసిన కృషి అమూల్యమని సహచరులు, ప్రజాప్రతినిధులు స్మరించారు. రాయలసీమకు నీరు అందించాలన్నది ఆయన జీవిత లక్ష్యం. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ సంకల్పం నుంచి వెనక్కి తగ్గలేదు అని ఇంజనీర్‌ వర్గాలు తెలిపారు.

ప్రాంత ప్రజల సంక్షేమం కోసం సుబ్బరాయుడు వేసిన అడుగులు, ప్రణాళికలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పలువురు భావిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

Leave a Reply