మండలిపై పట్టుసాధిద్దాం
ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేనాని రెడీ
పార్లమెంట్ వారీగా సమన్వయం
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
సమన్వయ కర్తలను నియమించిన పవన్ కల్యాణ్
ప్రణాళికా ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశం
వెలగపూడి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూటమి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.. సీఎం చంద్రబాబు మంత్రులకు, నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ తరుణంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా..
ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు.. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి జనసేన తరపున పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా పవన్ కళ్యాణ్ సమన్వయకర్తలను నియమించారు. ఆయా పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కూటమి నేతలతో సమన్వయం చేసుకొంటూ, నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అభ్యర్ధుల విజయానికి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.
జనసేన సమన్వయకర్తలు వీరే
- కాకినాడ – తుమ్మల రామస్వామి
- రాజమండ్రి – యర్నాగుల శ్రీనివాస రావు
- అమలాపురం – బండారు శ్రీనివాసరావు
- నరసాపురం – చన్నమల్ల చంద్ర శేఖర్
- ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు
- విజయవాడ – అమ్మిశెట్టి వాసు
- మచిలీపట్నం – బండి రామకృష్ణ
- గుంటూరు – నయబ్ కమల్
- నరసరావుపేట – వడ్రాణం మార్కండేయ బాబు
