గోవధ కేంద్రాలపై చర్యలకు వినతి..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో జరుగుతున్న అక్రమ గోవధల కేంద్రాలపై దాడులు చేసి నిషేధించాలని కోరుతూ గోరక్షక్,హిందూ వాహిని, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నేతలు స్థానిక తాహసిల్దార్ బక్కయ్యకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు.గోమాత హిందూ సమాజానికి ఆరాధ్య దైవంమని,హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న అక్రమ గోవధలను అరికట్టి ధర్మాన్ని కాపాడాలని పేర్కొన్నారు.తక్షణమే స్పందించి అక్రమ గోవధ కేంద్రాలపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా సహ సంయోజక్ దండవేణి శ్రీధర్,
మండల సంయోజక్ చెరుకు ప్రణయ్,బజరంగ్ దళ్ మండల్ ప్రముఖ్ పిల్లి అన్వేష్,కస్తలపురి నరేష్,పందిరి మనీష్,రీశ్వంత్,సాయిసంజయ్,మహేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply