దండేపల్లి మండల టీయూవీ అధ్యక్షుడిగా ఎంబడి సురేందర్

దండేపల్లి మండల టీయూవీ అధ్యక్షుడిగా ఎంబడి సురేందర్

దండేపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) దండేపల్లి మండల అధ్యక్షుడిగా ఎంబడి సురేందర్‌ను నియమిస్తూ ఆ సంస్థ రాష్ట్ర నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక వ్యవస్థాపక చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోటెడి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ఎంబడి సురేందర్ దండేపల్లి మండలంలో నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వారికి అందేలా కృషి చేయాలని, ఉద్యమకారుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడాలని సురేందర్‌కు సూచించారు. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష పదవిని అప్పగించిన టీయూవీ రాష్ట్ర నాయకత్వానికి ఎంబడి సురేందర్ కృతజ్ఞతలు తెలిపారు.