ప్రజల మధ్యే ఉంటా…ప్రజల కోసం పనిచేస్తా

మోత్కూర్, ఆంధ్రప్రభ ; ప్రజల మధ్యే ఉంటా…ప్రజల కోసం పనిచేస్తానని 2 వ వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి మర్రి మరియమ్మ ఆదివారం విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు . ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వార్డు సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్ మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య,నాయకులు మర్రి అనిల్ కుమార్,కట్ట ఇంద్రజ్యోతి,గుంటి దేవా,గుంటి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.