రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పెంచాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం రైతులు పండించిన పండించిన వివిధ రకాల పంటలకు మద్దతు ధర పెంచాలని అఖిలభారతఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు అంజప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్లలో కేంద్ర ప్రభుత్వం రైతుల పండించిన పంటలకు అసగ్రమైన మద్దతు ధరలు నిర్ణయించడాన్ని నిరసిస్తూ కిసాన్ మోర్చా పిలుపుమేరకు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఎంఎస్ పిఆర్డర్ ప్రతులను దహనంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ( సిసిఈపి) 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు ( యంఎస్పి) 2026-27 ఏడాదికి పెంచడానికి నిర్ణయం తీసుకుందన్నారు.
12 సంవత్సరాల క్రితం అధికారంలోకి బిజెపి రాకముందు స్వామినాథన్ కమిటీ సిఫారసులను అనుసరించి సమగ్ర వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుల ప్రాతిపదికన కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్లు గుర్తు చేశారు. చేసింది. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందులు, కూలీల వేతనాలు, డీజిల్, విద్యుత్తు, సాగునీరు ఉత్పత్తి కారకాల ధరలు ఆకాశాన్నింటి వీటిని పరిగణలోకి తీసుకోకుండా యంఎసిపి ఎ2ఎఫ్ఎల్ ప్రకారం నిర్వహించినట్లు తెలిపారు.
ఇది సాధారణంగా సి2 కంటే సుమారు 30 శాతం తక్కువఅయినప్రభుత్వం తనను తాను సమర్ధించుకోవడం సిగ్గుచేటు అన్నారు. విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మం దులు, కూలీల వేతనాలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్ వంటి ధరలు భారీగా పెంచిన కేంద్రం పంటల మద్దతు ధర నామమాత్రంగా పెంచకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ కార్యక్రమం లో చిన్న బాలు శీల కృష్ణయ్య బొక్కి బాలకృష్ణ కొల్లూరు జైపాల్ కొత్త గుడిసె నరసింహ, గుర్రాల నర్సింహులు, రైకల్ అంజప్ప, బోయ అంజప్ప, కప్పకండ్ల లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు.
