cultural | రాష్ట్రపతి భవనంలో కోలాహలం

cultural | రాష్ట్రపతి భవనంలో కోలాహలం

  • సందర్శనకు రేపే చివరి రోజు

cultural | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లోని రాష్ట్రపతి భవనం(President’s House) ఈ రోజు సందర్శకులతో సందడిగా మారింది. రాష్ట్రపతి భవనంలో ప్రజల సందర్శన కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఆయా విద్యా సంస్థల యాజమాన్యం బస్సులు ఏర్పాటు చేసి తీసుకు వచ్చారు. ఒక వైపు విద్యార్ధులు, మరో వైపు ప్రజలతో రాష్ట్రపతి భవనం కోలాహలంగా మారింది.

ఈ రోజు ఇప్పటి వరకు సుమారు 27 వేల మంది(27 thousand people) సందర్శించారు. మరో ఐదువేల మంది వరకు సందర్శించే అవకాశం ఉంది. రాష్ట్రపతి భవవనంలో పలు స్టాళ్ళు, ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హ్యాండ్లూమ్ వస్త్రాలు(handloom textiles) స్టాళ్లు ఏర్పాటు చేశారు. చేనేత వస్త్రాలు తయారు చేయు విధానం డెమో ఇస్తున్నారు. సాంస్కృతిక(cultural) కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

రాష్ట్రపతి భవనంలో ప్రజల సందర్శనకు రేపు (ఈ నెల 30) చివరి రోజు. ఆన్లైన్, ఆఫ్ లైన్(online, offline)లో టిక్కెట్ పొంది సందర్శించి వచ్చు. ఆఫ్లైన్ లో అయితే రాష్ట్రపతి భవన్ ముందు ఏటీఎం మిషన్ నుంచి ఆఫ్ లైన్ టిక్కెట్ పొందవచ్చు.