CRIME | కొడుకును హత్య చేసి..

CRIME | కొడుకును హత్య చేసి..

  • తండ్రి ఆత్మహత్య..
  • రాంపూర్ లో విషాదం
  • దివ్యాంగుడనే నేపంతో…

CRIME | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాంపూర్ లో కొడుకును హత్య చేసి, తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఇది. కొడుకు దివ్యాంగుడైనందున ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడుకు మెడను కత్తితో కోసి హత్య చేసి, తండ్రి మెడ కత్తితో కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని రాంపూర్ కు చెందిన పాలగాని భూమయ్య(38), దివ్యాంగుడైన అతని కొడుకు కార్తీక్(10)ను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇవాళ‌ మధ్యాహ్నం కత్తితో మెడ కోసి హత్య చేసి, తండ్రి కత్తితో మెడ కోసుకొని అక్కడికక్కడే మృతి చెందారు.

CRIME

భూమయ్యకు భార్యతో పాటు దివ్యాంగుడైన ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భూమయ్య తలుపుల గడియ పెట్టుకొని కొడుకును హత్య చేసి, అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కార్తీక్ అంగవైకల్యంతో పుట్టి బాధపడుతున్నందున, తండ్రికి ఉపాధి లేనందున కుటుంబ భారం పెరగడంతో ఘటనకు పాల్పడ్డట్లు కొందరు గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply