Padipuja | ఘనంగా మౌని అమావాస్య వేడుకలు

Padipuja | ఘనంగా మౌని అమావాస్య వేడుకలు

  • శ్రీ అయ్యప్పశక్తి పీఠం వద్ద వైభవంగా పడిపూజ

Padipuja | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇవాళ‌ మౌని అమావాస్య వేడుకలు ప్రజలు, భక్తులు అత్యంత భక్తితో ఘనంగా జరుపుకున్నారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి శబరి పీఠం వద్ద గురుస్వాములు, భక్తుల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప పడిపూజ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగింది. గురుస్వామి రఘువీర్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలు, తేనె, పంచదార, నెయ్యి బస్వంతో అభిషేకం నిర్వహించారు.

వివిధ రకాల పూలతో 18మెట్లు ఏర్పాటు చేసి పడి వెలిగించి అయ్యప్ప భక్తి పాటలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మౌని అమావాస్యను పురస్కరించుకొని కర్ణాటక – తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో వెలిసిన శ్రీ ఇడ్లూరి శంకర లింగేశ్వర స్వామి, ఊట్కూర్ వీరభద్రేశ్వర స్వామి, కాళికామాత, ఈశ్వర్ మందిర్, గ్రామపంచాయతీ వద్ద ఉన్న శివాలయం, మూగబశేశ్వర స్వామి, నిడుగుర్తి గుట్టపై శివాలయం, బిజ్వార్ శ్రీ అంబాత్రాయ శక్తిపీఠం, పులిమామిడి గుట్టపై రామలింగేశ్వర స్వామి తదితర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మౌని అమావాస్య వేడుకల్లో భాగంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Leave a Reply