Cricket competitions | క్రీడలు స్నేహపూర్వకంగా ఆడుకోవాలి..

Cricket competitions | కామారెడ్డి, ఆంధ్రప్రభ : క్రీడలు స్నేహపూర్వకంగా ఆడుకోవాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ చెప్పారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఇందిరా గాంధీ స్టేడియంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున క్రికెట్ పోటీలలో పాల్గొన్నారు. క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. ఓటమి చెందినవారు నిరుత్సాహ పడకుండా రేపటి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. క్రికెట్ పోటీలలో పాల్గొన్న వారందరూ విజేతలుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
