Competitions | నిజాంపేటలో సీఎం కప్ ర్యాలీ

Competitions | నిజాంపేటలో సీఎం కప్ ర్యాలీ

Competitions | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో శనివారం సీఎం కప్ ర్యాలీని తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంఈఓ యాదగిరి, ఎస్సై రాజేష్‌ల ఆధ్వర్యంలో మండలంలోని ప్రధాన వీధుల గుండా కప్‌తో ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి నుండి ఫిబ్రవరి నెల ఆఖరి వరకు గ్రామస్థాయి నుంచి మండల జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీ స్థాయిలో క్రీడలు ఈనెల 17 నుంచి 22 వరకు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే మండల స్థాయి 28 నుంచి 31వరకు కొనసాగుతాయని, రాష్ట్రంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను వెలికితీసేందుకే ప్రభుత్వం ఏటా ఈ పోటీలు నిర్వహిస్తోందన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు భాను ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం, సర్పంచులు చల్మేటి నరేందర్, ప్రవీణ్, సునీత, సుశీల, ముత్యాల సరిత రెడ్డి, బాబు నాయక్, ఉప సర్పంచ్ గెరిగంటి బాబు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మహేందర్, కార్యదర్శులు ప్రశాంత్ గౌడ్, హరి హుస్సేన్, నర్సింలు, నాగలక్ష్మి, ప్రేమ, భాగ్యలక్ష్మి, మమత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply