Couple | విస్తృత ప్రచారం..

Couple | విస్తృత ప్రచారం..

రాంపురం బీసీల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే..
ప్రచారంలో దూసుకుపోతున్న వరలక్ష్మీ దంపతులు..

Couple | వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గొడ్డే సాయిబాబా వరలక్ష్మి దంపతులు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి దంపతులు ప్రచారంలో ప్రజల మద్దతు కూడగట్టుకోని ముందుకు సాగుతున్నారు. పేరూరు పంచాయతీలో అత్యంత కీలకమైన రాంపురం బీసీ ఓటర్లు నూటికి నూరు శాతం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గొడ్డే సాయిబాబా వరలక్ష్మిలకే పూర్తి మద్దతు ప్రకటిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ముందుకు వచ్చారు. రాత్రి రాంపురం బీసీ గ్రామంలో బొడ్రాయి సెంటర్ వద్ద 200 మందితో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గోడ్డే సాయిబాబు వరలక్ష్మి దంపతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగాస రమేష్, కురుసం కృష్ణమూర్తి, బొల్లె వెంకన్న, బోల్లె నరేష్, ఆనందరావు వార్డ్ మెంబర్ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజాదరణ పుష్కలంగా లభిస్తుంది. పంచాయతీ ప్రజలు ఉవ్వెత్తిన కదిలి రావడంతో వరలక్ష్మి ప్రచారంలో దూసుకెళుతుంది.

ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా పని చేయడానికి ముందుకు రావడం జరిగిందని.. పదేళ్లలో చేయలేని అభివృద్ధిని పంచాయతీలో చేసి చూపిస్తానని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధికి బాటలు వేస్తానని.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందే విధంగా పెద్ద నాయకులతో మాట్లాడి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఏ వాడ కెళ్ళినా ప్రజల్లో చక్కటి స్పందన లభిస్తుందని.. తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పేరూరు పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాకు ఓటు వేయండి.. అభివృద్ధిని ఆశించండి. ప్రజాక్షేత్రంలో ఉండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిప్పనపల్లి కళ్యాణ్ రాజ్, తొర్రెం లక్ష్మీనారాయణ, తోటపల్లి ఎల్లయ్య, తుమ్మ ధనమ్మ, తల్లడి శ్రీకాంత్, అట్టం ఏసు, అరికిల్ల రామయ్య , గొబ్బూరి రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply