పోస్ట్ ఆఫీస్ ల్యాండ్ సమస్య పై కలెక్టర్ కు వినతి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పోస్టాఫీస్ స్థాపన దిశగా చర్యలు వేగం పుంజుకున్నాయి.

గత సంవత్సరం సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నీలం రవి, స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో పోస్టాఫీస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్, పోస్టాఫీస్ నిర్మాణానికి అవసరమైన భూమిని అప్పగించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఇప్పటివరకు భూమి హస్తాంతరం జరగకపోవడంతో, మంగళవారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కౌన్సిలర్ నీలం రవి కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తహసీల్దార్ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే భూమిని సరెండర్ చేయాలని ఆదేశించారు.