రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం…

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం…

పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం..

మేడ్చల్, ఆంధ్రప్రభ : వ్యవసాయ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ స్పష్టం చేశారు. గురువారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు వ్యవసాయ రైతుల సొసైటీ కేంద్రంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ​

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు. ​రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిన వెంటనే, ఆ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. పూడూరు సొసైటీ వారు ఒకవేళ గన్నీ బ్యాగులు (బస్తాలు) సరఫరా చేయడంలో విఫలమైతే, మేడ్చల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోనే బస్తాలను పంపిణీ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ​

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం అనవసర విమర్శలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ​రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సింగరేణి పోచయ్య, పూడూరు సొసైటీ డైరెక్టర్లు మనోహర్ రెడ్డి, శ్రీకాంత్ , స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply