చైర్మన్‌చే సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

చైర్మన్‌చే సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ (సీఎంఆర్ఎఫ్)నిది కింద కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జెండగూడగ్రామపంచాయతీకి చెందిన కోరింగ రాధకు 28 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కు మంజూరు కావడంతో మంగళవారం మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు,సర్పంచులు నాయకులతో కలిసి బాధితురాలకు చెక్కును పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నిరుపేదలకు వైద్య సేవలపరంగా సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిసిసి కార్యవర్గ సభ్యులు పేందూరు ప్రకాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పంద్ర శేకు, వివిధ పంచాయతీల సర్పంచులు సెడమ్మకి జానే రావు, మడవి లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెస్రం అంబాజీరావు,మెస్రం భూపతి, గోడం గోపీచంద్, మెస్రం నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply