Jannaram చెట్లతోనే మానవాళి మనుగడ
Jannaram చెట్లతోనే మానవాళి మనుగడ
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం రూరల్ (Jannaram), ఆంధ్రప్రభ
చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి రేంజ్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతి వ్యక్తి బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం రేంజ్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
తదనంతరం కవ్వాల వెదురు ఉత్పత్తుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, వెదురు బొంగులతో తయారు చేస్తున్న వివిధ రకాల వస్తువులను పరిశీలించారు. నిరుద్యోగ యువత ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీవో రాంమోహన్, రేంజ్ ఆఫీసర్ జి. లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, గ్రామ సర్పంచ్ గుగ్లావత్ శంకర్, హిట్‌కాన్ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ వెంకటి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జి. మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్, జిల్లా కార్యదర్శి ముజాఫర్, మండల అధ్యక్షుడు అజ్మీర్ నందునాయక్, నాయకులు ముత్యం సతీష్, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
