ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి……

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్ ఢీకొని ఒక వ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతమ్మ ఆలయం వద్ద ఆలయానికి వచ్చే వాహనాలకు పార్కింగ్ రుసుము వసూలు చేసే రేగులగడ్డ గ్రామానికి చెందిన నంచర్ల సతీష్ ను జగ్గయ్యపేట ఆర్టీసీ చెందిన బస్సు బలంగా ఢీకొట్టడంతో సతీష్ ప్రమాదవస్థలోనే మృతి చెందాడు జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.