ప్రజా ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

ప్రజా ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

  • టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన అందిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదన్నారు.
సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవడం వల్లే భారతదేశ చిత్ర పటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చేశారు.
2014 జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం 12 ఏళ్లు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపడుతున్న సంక్షేమం ప్రజల్లో కొత్త ఆకాంక్షను నింపుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, కౌన్సిలర్ ముద్దసాని సురేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కొనుగోటి సోమేశ్వరరావు, చిత్తలూరు శ్రీనివాస్ గౌడ్, చెవిటి సధాకర్,మంగళపల్లి రామచంద్రయ్య, వెంకన్న యాదవ్, రవీంద్రాచారి, జక్క మహబూబ్ రెడ్డి, జలగం శ్రీనివాస్, బిక్షం గౌడ్, పింగిలి ఉష, దొంగరి రేవతి శంకర్, పంజా కల్పన, దేవేందర్ రాజు, సోమిరెడ్డి, చిదురాల రవి, రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్, అనిత, రాణి, రమేష్ నాయక్, పరశురాములు, ఎర్రం రాజు తదితరులు పాల్గొన్నారు.