ఊట్కూర్ లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించి పంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.
ఊట్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రమేష్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి శంకర్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో గణేష్ రెడ్డి, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ బాల్‌రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సంతోషి, పులిమామిడి ఆసుపత్రిలో డాక్టర్ సాయిరాం, ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ మాధవి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఊట్కూర్, మల్లేపల్లి, చిన్నపోర్ల, పెద్దపోర్ల, పెద్దజట్రం, కొల్లూరు, సమస్తాపూర్, పగిడిమర్రి, ఓబులాపూర్, అమీన్‌పూర్, తిప్రాసుపల్లి, బిజ్వార్, కొత్తపల్లి, మొగ్దుంపూర్, ఎడవెల్లి, పులిమామిడి, నిడుగుర్తి, అవుసలోనిపల్లి, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మండల వ్యాప్తంగా గ్రామాల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో కిషోర్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యజ్ఞేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
