మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక కృషి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని మెండోరా గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పథకంలో 10 లక్షల నిధులతో మంజూరైనా మహిళా సమాఖ్య 2, భవనాలకు భూమి పూజ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్, స్థానిక నాయకులకు కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ, తొందరగా నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని స్థానిక నాయకులకు కోరారు.
అలాగే గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ మాట్లాడుతూ, ఈ సమాఖ్య భవనానికి నిధుల మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల ముత్యాల సునీల్ కుమార్ కు మహిళా సంఘాల సభ్యులు స్థానిక నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నదని, వాటిని ఉపయోగించుకొని వారు అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, నాయకులు పల్లె శేఖర్, వార్డు సభ్యులు సంతోష్,షేఫీ, బాలరాజు పల్లె రాము, బాజిరెడ్డి,అభిలాష్, సప్పాలా నారాయణ, కాంగ్రెస్ నాయకులు మెడికల్ సత్యం, పల్లికొండ నరేందర్, శేరి లింబన్న, ఐకేపీ సీసీ రఘు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ భోజన్న, గ్రామ మహిళా సమాఖ్య సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
