అభివృద్ధి చేసే నాయకునికి ఓటు వేయండి

జనగామ, ఆంధ్రప్రభ : రాష్ట్రాలు అభివృద్ధి జరగాలంటే కేంద్రం చేతిలోనే ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మద్యం డబ్బులతో ముందుకు వస్తున్నారు వారి ప్రలోభాలకు లొంగకండి లొంగితే మోసపోవడం మనవంతవుతుంది మరో ఐదు సంవత్సరాలు వారికి బానిసలుగా బతకాల్సిన అవసరం లేదని బిజెపి పార్టీ బలపరిచిన మూడో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కనుగూరి శ్రీలత అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని మూడో వార్డు బిజెపి అభ్యర్థి శ్రీలత ఆదివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మూడో వార్డులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్న ఎవ్వరు పట్టించుకునే నాధుడు లేడని చూడలేక సొంత డబ్బులతో కాలనీలలో మట్టి పోయించి నా వంతు కృషి చేశానని ఇన్దుకుగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీలతకు ఓటు వేసి గెలిపించగలరని బిజెపి నాయకులు సుబ్రహ్మణ్యం, వెంకటేష్ ప్రచారం నిర్వహించారు.