సిగాచి బాధితులకు న్యాయం చేయాలి

సిగాచి బాధితులకు న్యాయం చేయాలి
- రేపు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ధర్నా
సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): సిగాచి ఫార్మా కంపెనీ బాధితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) నేతలు తెలిపారు. సిగాచి కంపెనీలో పనిచేసి మృతిచెందిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నేతలు వై.అశోక్ కుమార్, రాగులపల్లి లక్ష్మి, చంద్రారెడ్డి, మానస తెలిపారు.
