Kites | ప్రాణం తీసిన పతంగి….!!

Kites | ప్రాణం తీసిన పతంగి….!!
- భవనం పై పతంగి ఎగరవేత….
- పై నుండి కింద పడిన బాలుడు….
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స….
- ఐదు రోజుల తర్వాత మృతి….
- సిద్దిపేట లో ఘటన….
- కుటుంబంలో తీవ్ర విషాదం…
- పెద్ద మల్లారెడ్డిలో అంత్యక్రియలు..
- కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్…
Kites | బిక్కనూర్, ఆంధ్రప్రభ : సరదాగా స్నేహితులతో పతంగులు ఎగరవేస్తున్న ఓ బాలుడు రెండంతస్తుల భవనం పై నుండి కిందపడి గాయాల పాలయ్యాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబాన్ని తీర విషాదంలో పడేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన అవుసుల ప్రకాష్ అతని భార్య గాయత్రీ ,ఇద్దరి కొడుకులు రోహిత్, కార్తీకులతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉంటున్నారు.
అక్కడ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిన్న కొడుకు కార్తీక్ సంక్రాంతి పండగ సందర్భంగా తన స్నేహితులతో కలిసి రెండంతస్తుల భవనంపై గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందోత్సవాల మధ్య మునిగిపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాన్ని చూస్తూ వెనుకకు అడుగులు వేయగా రెండంతస్తుల భవనం పై నుండి కింద పడిపోయాడు. వెంటనే తోటి స్నేహితులతో పాటు పలువురు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అపార స్థితిలో పడి ఉన్నా కార్తీక్ ను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాదుకు తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత కన్నుమూశారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కార్తీక్ రెండు అంతస్తుల భవనం పై పడే మృతి చెందిన విషయం గ్రామంలో తెలియడంతో పలువురు కంటతడి పెట్టారు.
మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి తీసుకువచ్చారు. సందర్భంగా గ్రామ సచివాలయ పాలకవర్గ సభ్యులు మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గ్రామంలో జరిగిన అంతక్రియల్లో గ్రామ సర్పంచి కోడూరి సాయ గౌడ్ తో పాటు పాలకవర్గ సభ్యులు నాయకులు గ్రామస్తులు పాల్గొని కంటతడి పెట్టారు. చిన్న వయసులో ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమని గ్రామ సర్పంచ్ సాయ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
