వడదెబ్బతో వృద్ధుడి మృతి..
చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని ని జూకల్ గ్రామానికి చెందిన మాశబోయిన రాజయ్య (65) అనే వృద్ధుడు వడదెబ్బ తగిలి బుధవారం మృతి చెందినట్లు, ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే,చల్లగరిగ గ్రామ శివారులో రాజయ్య కౌలు కి తీసుకున్న పొలంలో మక్కజొన్న చొప్ప కలపెట్టేందుకు వెళ్ళాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంత ఆయన తీవ్ర అస్వస్థతకు గురై, పక్కనే ఉన్న చెట్టు కింద స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన సమీపంలోని వ్యక్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు మాశబోయిన రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు.
