వరికోత, మిషన్ల యజమానులకు అవగాహన సదస్సు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని వరి కోత మిషన్ యజమానులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మండల అధికారుల సమక్షంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్, డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్, చల్లగరిగ ఏఈఓ దీపక్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరి కోత సమయంలో ధాన్యం తాలు (పొట్టు) లేకుండా, శుభ్రంగా వచ్చేలా చూడాలని అధికారులు యజమానులకు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు.

మిషన్ ఇంజిన్ ఆర్ పి యం 18 నుండి 20 మధ్య మాత్రమే ఉండాలని,కోత కోసే సమయంలో బ్లోయర్ తప్పనిసరిగా ఆన్ చేసి ఉంచాలని కోరారు. దీంతో ధాన్యంలోని చెత్తాచెదారం తొలిగిపోయి నాణ్యమైన వడ్లు వస్తాయన్నారు.మిషన్ వేగాన్ని నియంత్రిస్తూ బీ,టు – ఏ, వన్ గేర్లలో మాత్రమేనడపాలనిఆదేశించారు.​రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత హార్వెస్టర్ యజమానులపై ఉందని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి, ధాన్యం నాణ్యత దెబ్బతింటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని హార్వెస్టర్ యజమానులు, ఆపరేటర్లు , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply