ఎస్సీ, ఎస్టీల విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు…

ఎస్సీ, ఎస్టీల విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు…

పల్నాడు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ

నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ జిల్లాలో ఎస్సీ, ఎస్టీల,విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల నాలుగో శనివారం నాడు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల విభిన్న ప్రతిభావంతులకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఈ నెల నాలుగో శనివారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను అందించి సమస్యలను తెలియజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.

నాలుగో శనివారం నాడు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారుగా 33 దరఖాస్తులు అందాయి.ఈ సందర్బంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో వెనుకబడిన వర్గాలు వారి సమస్యలకోసం ప్రత్యేకం గా చోరవ తీసుకోని ప్రతి నెల నాలుగువ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ అవకాశం ప్రజలు ఉపయోగించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు…..

Leave a Reply