Mp-Questions : లోక్ సభలో కృష్ణాజి్ల్లా గళం Andhra Prabha Top News
Mp-Questions : లోక్ సభలో కృష్ణాజి్ల్లా గళం Andhra Prabha Top News
- సొర్లగొంది..గుల్లలమోదపై ఎంపీ ప్రశ్నలు
- రూ.4కోట్లుతో ఈ రెండు గ్రామాల అభివృద్ధి
- కేంద్ర మంత్రి రంజన్ వివరణ
( ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి )
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం లోని సోర్లగొంది గుల్లలమోద తీరప్రాంత మత్స్యకార గ్రామాల గురించి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లోక్ సభలో ప్రస్తావించారు. వర్షా కాల పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) ని బాలశౌరి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని తీరప్రాంతాల్లో సమగ్ర ఆధునిక మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతు అందిస్తున్నదా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో సోర్లగొంది . గుల్లలమోద గ్రామాలను అభివృద్ధి కోసం గుర్తించారా?, గుర్తించినట్లయితే, చేపల ఆరబెట్టే వేదికలు, ప్రాసెసింగ్ కేంద్రాలు, చేపల మార్కెట్లు, ఫిషింగ్ జెట్టీ, ఐస్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజ్, అత్యవసర రక్షణ సదుపాయాలు మొదలైన వాటి ద్వారా ఈ గ్రామాలను ఆదర్శవంతమైన, ఆర్థికంగా అభివృద్ధి చెందిన మత్స్యకార గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యల వివరాలు ఏమిటి ఈ పథకాన్ని మార్చి 2026 వరకు పొడిగించారా? అయితే వివరాలు ఏమిటి? అని లోక్ సభలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) రాత పూర్వక సమాధానం ఇచ్చారు. 2020-21 నుంచి అమలులో ఉన్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కో సమగ్ర ఆధునిక తీరప్రాంత మత్స్యకార గ్రామ అభివృద్ధికి రూ.7.50 కోట్లు వ్యయంతో పథకం అమలు జరుగుతోంది, . మత్స్యకారుల జీవనోపాధి, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహింటచటటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద ఆధునిక మౌలిక వసతులు, విపత్తులను తట్టుకునే గృహాలు, తుఫాను సునామీ ఆశ్రయ కేంద్రాలు, చేపల నిల్వ మార్కెటింగ్ సదుపాయాలు వంటి అవసరాలను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 60:40 నిష్పత్తిలో అమలు చేస్తారు. అని వివరించారు.
Mp-Questions : ఏపీ అమలు చేయలేదు
2020-21 నుంచి అమలులో ఉన్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు వినియోగించుకోలేదు. అయినప్పటికీ, తీరప్రాంత మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) వివరించారు. కేంద్ర వాతావరణ మార్పులకు తట్టుకునే తీరప్రాంత మత్స్యకార గ్రామాల అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 100 గ్రామాలను ఎంపిక చేసింది.ఈ పథకంలో ఒక్కో గ్రామానికి రూ.2 కోట్లు కేటాయిస్తారు. ఈ వ్యయాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి రాష్ట్రంలోని 15 గ్రామాలను ఎంపిక చేయగా, అందులో కృష్ణా జిల్లాలోని సోర్లగొంది , గుల్లలమోద గ్రామాలు కూడా ఉన్నాయి.ఈ 15 గ్రామాల అభివృద్ధికి రూ.30 కోట్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటి వరకు అమలు కోసం రూ.15 కోట్లు విడుదల చేసింది.
Mp-Questions : ఆ గ్రామాల్లో అభివృద్ధి ఇలా..
సోర్లగొంది, గుల్లలమోద గ్రామాల్లో చేపట్టనున్న ప్రధాన పనులు
చేపల ఆరబెట్టే వేదికలు. సౌరశక్తితో పనిచేసే చేపల ఆరబెట్టే యూనిట్లు బహుళ ప్రయోజన మత్స్య కేంద్రం, ఉమ్మడి చేపల మార్కెట్
హైమాస్ట్ సౌర దీపాలు, జెట్టీ విస్తరణ, సముద్ర శైవలాల (Seaweed) సాగు. సముద్ర కేజ్ కల్చర్, కలర్ GPS పరికరాలు, ప్రాణరక్షణ పరికరాలు, ఐస్ బాక్సులు, ఇతర ఉత్పాదకత పెంపు చర్యలు
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 30 సెప్టెంబర్ 2026 వరకు పొడిగించినట్టు కేంద్ర మంత్రి రంజన్ వివరించారు.
Mp-Questions : గుల్లలమోదకు రూ.2కోట్లు
గుల్లలమోద గ్రామం (మొత్తం వ్యయం: రూ.200.05 లక్షలు)
మత్స్య మౌలిక వసతులు, జెట్టీ విస్తరణ , పడవల నిలుపుదల సదుపాయాలు – రూ.144.20 లక్షలు (లబ్ధిదారులు: 1,450 మంది)
ఆర్థిక కార్యకలాపాలు . సముద్ర శైవలాల సాగు – రూ.5.00 లక్షలు
GPS పరికరాలు – రూ.4.00 లక్షలు, ప్రాణరక్షణ పరికరాలు – రూ.2.00 లక్షలు, ఐస్ బాక్సులు – రూ.14.85 లక్షల, సముద్ర కేజ్ కల్చర్ – రూ.30.00 లక్షలు మంటూరు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
Mp-Questions : సొర్లగొందికి రూ.1.95 కోట్లు
సోర్లగొంది గ్రామం (మొత్తం వ్యయం: రూ.195.90 లక్షలు)
మత్స్య మౌలిక వసతులు, చేపల ఆరబెట్టే వేదిక – రూ.10.00 లక్షలు
సౌర చేపల ఆరబెట్టే యూనిట్లు రూ.20.00 లక్షలు, బహుళ ప్రయోజన మత్స్య కేంద్రం రూ.40.00 లక్షలు, ఉమ్మడి చేపల మార్కెట్ – రూ.60.00 లక్షలు, 16 మీటర్ల హైమాస్ట్ సౌర దీపాలు (2) – రూ.5.00 లక్షలు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు . సౌర దీపాలు – రూ.4.00 లక్షలు , సముద్ర శైవలాల పైలట్ ప్రాజెక్టులు – రూ.5.50 లక్షలు , కలర్ GPS పరికరాలు – రూ.4.00 లక్షలు ప్రాణరక్షణ పరికరాలు (లైఫ్ బోయ్, లైఫ్ జాకెట్లు) – రూ.7.50 లక్షలు సముద్ర కేజ్ కల్చర్ – రూ.40.00 లక్షలు మంజూరు చేసిన్టు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
