Collector D.K. Balaji | మీ కోసం కార్యక్రమం

Collector D.K. Balaji | మీ కోసం కార్యక్రమం
Collector D.K. Balaji | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సమస్యల పరిష్కారానికి మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే.బాలాజీ తెలిపారు. సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మీ కోసం కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
