రైల్వే కోదండ రామాలయానికి రూ. 11 వేలు వితరణ

మధిర టౌన్, ఆంధ్రప్రభ ; మధిర రైల్వే కోదండ రామాలయ పునర్నిర్మాణానికి మధిరకు చెందిన చలవాది జగన్నాథం వసంత దంపతులు 11,116 రూపాయలను ఆలయ కమిటీ చైర్మన్ కోనా జనార్దన్ రావుకి వితరణగా అందజేశారు. ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసిన జగన్నాధం ను కోనా జనార్దన్ రావు అభినందించారు.