అవసరంలో అండగా నిలుస్తున్న సహాయ హస్తం

అవసరంలో అండగా నిలుస్తున్న సహాయ హస్తం

పెడన ఆంధ్రప్రభ: పెడన తోటముల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. పెడన, గూడూరు, పెడన పట్టణ పరిధిలోని 33 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.14.24 లక్షలు మంజూరు కావడం సంతోషకరమని తెలిపారు.

నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక విద్యుత్ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply