మంత్రి నారా లోకేష్ కు వినతి పత్రం అందజేత

మంత్రి నారా లోకేష్ కు వినతి పత్రం అందజేత

విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్ అనంతపురం జిల్లా సభ్యులు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని కలిసి, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల రెగ్యులరైజేషన్, నిధి పోర్టల్ సమస్యలు,వంద శాతం గ్రాస్ సాలరీ అమలు, మెడికల్ లీవ్, చైల్డ్ కేర్ లీవ్ తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply