సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రేగొండ, ఆంధ్రప్రభ: భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, గోరికొత్తపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం రేగొండ రైతు వేదికలో పంపిణీ చేశారు.

రేగొండ, గోరికొత్తపల్లి మండలాలకు చెందిన 57 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.14.72 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్‌ఓసీ వంటి పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి త్వరితగతిన అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుంబాలకు ఆపద్బాంధవంగా నిలుస్తోందన్నారు.

భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని, చిట్యాల మండల ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆధునిక వైద్య సేవలు, అవసరమైన మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వారణాసి మౌనిక, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్‌రావు, తహసీల్దార్ శ్వేతారావు, నాయకులు ఇప్పకాయల నరసయ్య, పున్నం రవి, ఏనుగు రవీందర్ రెడ్డి, మేకల భిక్షపతి, తిరుమలగిరి సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్, గంగుల రమణారెడ్డి, చిగురుమామిడి కుమారస్వామి, నిమ్మల విజేందర్, పన్నాటి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.