ఆపదలో స్నేహితురాలికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు..
మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 2005-2006 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు తమతో పాటు చదువుకున్న స్నేహితురాలు చిల్లవసంత భర్త శ్రీను చనిపోయిన విషయం తెలుసుకొని నార్కెట్ పల్లి మండలం తొండ్లయి గ్రామంలో చిల్ల వసంతకు రూ.20 వేలు ఆర్థిక సాయంగా అందజేశారు. ఆపదలో ఉన్న స్నేహితురాలికి సాయం చేసిన స్నేహితులను గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల యాకు ,బీసు వెంకటేష్ , అద్దంకి రమేష్, కడమంచి ధనంజయ్, కందుల కవిత,ఎండి మలాన్ బి తదితరులు పాల్గొన్నారు.
