బాసర ఆలయ హుండీ ఆదాయం కోటి

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం ఆలయంలోని సాధారణ అక్షరాభ్యాస మండపంలొ ఆలయ ఈవో అంజనీదేవి, ఆలయ సిబ్బంది పోలీసుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయానికి ఒక కోటి ఆరు లక్షల నలభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు (1,06,45,359/-) మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 04 కిలోలు, విదేశీ కరెన్సీ 17 నోట్లు లభించాయని ఈ ఆదాయం ఆలయానికి 49 రోజుల్లో సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ నిర్మల్ పరిశీలకులు ఆర్.రవికిషన్, ఏ ఈ ఓ గంగా శ్రీనివాస్, పర్యవేక్షకులు శివరాజ్, సంజీవ్ రావు దేవస్థాన పరిపాలన,వైదిక సిబ్బంది, టి జి బి బ్యాంక్ సిబ్బంది, దేవస్థాన హోం గార్డ్స్, వాగ్దేవి సొసైటి సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర స్వామి సేవా సమితి, రాజన్న సిరిసిల్లా, నిర్మల్, నిజామాబాదు జిల్లా సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.