CM Chandrababu | టెక్ విద్యార్థులతో ‘క్వాంటమ్ టాక్’
CM Chandrababu | టెక్ విద్యార్థులతో ‘క్వాంటమ్ టాక్’
CM Chandrababu | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ‘క్వాంటమ్ టాక్’ (Quantum Talk) నిర్వహించారు. వేలమంది విద్యార్థులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం 50 వేలమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ టెక్నాలజీ. ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో టెక్ రంగంలో యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
