Operation Ragepill | రూ.182 కోట్ల క్యాప్టగాన్ పట్టివేత

Operation Ragepill | రూ.182 కోట్ల క్యాప్టగాన్ పట్టివేత
Operation Ragepill |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ రేజ్‌పిల్ ద్వారా భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.182 కోట్ల విలువైన క్యాప్టగాన్ డ్రగ్స్‌ను తొలిసారిగా అధికారులు పట్టుకున్నారని తెలిపారు. ఈ మాదకద్రవ్యాలను జిహాదీ డ్రగ్ గా పిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
ఈ డ్రగ్స్‌ను పశ్చిమాసియాకు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారని అమిత్ షా తెలిపారు. ఈ కేసులో ఓ విదేశీయుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఎక్స్ వేదికగా స్పందించిన అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
