Choutuppal హైర్ బస్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి
Choutuppal హైర్ బస్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి
చౌటుప్పల్ (Choutuppal), ఆంధ్రప్రభ:
తెలంగాణ రాష్ట్ర హైర్ బస్ (అద్దె బస్సుల) యజమానుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని సంఘం నేతలు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని రీక్కల సత్తిరెడ్డి గార్డెన్‌లో బుధవారం తెలంగాణ రాష్ట్ర హైర్ యజమానుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లక్కం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హైర్ బస్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో బస్సుల రీప్లేస్‌మెంట్ సాధనపై సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యవర్గం బలోపేతం కోసం ప్రస్తుత కార్యవర్గ కాలపరిమితిని పొడిగించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వరకాంతం మహిపాల్ రెడ్డి, ట్రెజరర్ సత్యంబాబు మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చించి హైర్ బస్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వందలాది మంది హైర్ బస్ యజమానులు పాల్గొన్నారు.
