ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుంది..
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
చండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ
మునుగోడు, నవంబర్ 5 (ఆంధ్రప్రభ): ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. ఈరోజు మండల పరిధిలోని బీరెల్లి గూడెం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, ఏపీఎం గోసుల భాస్కర్, ఏఈఓ మాధగోని నర్సింహ్మగౌడ్, సీఆర్పీ దీపిక, కోరే యాదయ్య, రైతులు యంపల్ల నరసింహ, దోటి వెంకటేశ్వర్లు, నర్సింహ్మ, వెంకన్న, యంపల్ల రాజమల్లు, సత్యనారాయణ, సంఘ బంధం అధ్యక్షురాలు దాసరి ఊర్మిళ, కన్నెబోయిన సునీత పాల్గొన్నారు.

