చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసు నమోదు ..

చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసు నమోదు ..

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ (Avinash Mahanthi) మహంతి స్పందించారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ప్రమాదంలో ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో 14 మందిని గుర్తించామని చెప్పారు. మిగిలిన ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నామని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని సీపీ అవినాష్ మహంతి వివరించారు.

Leave a Reply