natural skincare tips | కిచెన్ లోని ఈ మ్యాజిక్ వాటర్ ట్రై చేయండి!

natural skincare tips | కిచెన్ లోని ఈ మ్యాజిక్ వాటర్ ట్రై చేయండి!

natural skincare tips | బియ్యం నీటిలోని పోషకాలు – సైన్స్ ఏమంటోంది?
రైస్ వాటర్ ప్రయోజనాలు – చర్మానికి అద్భుత ఫలితాలు
ఎలా వాడాలి? ఎవరికి జాగ్రత్తలు అవసరం?

natural skincare tips | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : “గ్లాస్ స్కిన్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలందరి కల. ఆ మెరిసే చర్మం కోసం వేల రూపాయలు ఖర్చు చేసి కొరియన్ ప్రొడక్ట్స్ కొంటున్నారా? అయితే ఒక్క నిమిషం! ఆ ఖరీదైన సీరం బాటిల్స్ వెనుక ఉన్న అసలు రహస్యం మీ వంటింట్లోనే ఉంది. శతాబ్దాలుగా జపనీస్ మహిళల అందానికి కారణమైన ఆ ‘మ్యాజిక్ లిక్విడ్’ గురించి తెలిస్తే.. ఇకపై దాన్ని ఒక్క చుక్క కూడా వృధా చేయరు. వంటింట్లో ప్రతిరోజూ మనం పారబోసే బియ్యం కడిగిన నీళ్లలో ఉన్న విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. జపాన్, కొరియా, చైనా మహిళలు శతాబ్దాలుగా అందం కోసం వాడుతున్న ఈ “రైస్ వాటర్” ఇప్పుడు మోడ్రన్ స్కిన్‌కేర్‌లో కూడా ట్రెండింగ్. దీని వెనుక ఉన్న సైన్స్, నిజమైన ప్రయోజనాలు ఏంటో విశ్లేషిద్దాం.

బియ్యం నీటిలో ఏముంది? అసలు విలువ ఇదే

బియ్యం కడిగినప్పుడు నీటిలోకి విడుదలయ్యే పోషకాలు ఇవి:

natural skincare tips

ఇనోసిటాల్ – ఇది చర్మ కణాల గ్రోత్ పెంచుతుంది అలాగే డ్యామేజ్ రిపేర్ చేస్తుంది.
అమైనో ఆమ్లాలు- ఇవిచర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి, కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి.
విటమిన్ B, E- ఆక్సిడెంట్లు. మచ్చలు, ముడతలు తగ్గిస్తాయి.
మినరల్స్‌- జింక్, మెగ్నీషియం – మొటిమలు కంట్రోల్ చేస్తాయి.
ఫెరులిక్ యాసిడ్ – సూర్యరశ్మి వల్ల వచ్చే డ్యామేజ్ నుండి రక్షణ.
స్టార్చ్ – సహజమైన క్లెన్సర్, ఆయిల్ కంట్రోల్ చేస్తుంది.

2018లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, పులియబెట్టిన బియ్యం నీళ్లు UV డ్యామేజ్‌ను 20% వరకు తగ్గించగలవని నిరూపితమైంది.

ముఖానికి బియ్యం నీళ్లు.. 6 సైన్స్-బ్యాక్డ్ ప్రయోజనాలు

natural skincare tips
  1. మొటిమలు, ఆయిల్ కంట్రోల్
    బియ్యం నీటిలోని స్టార్చ్ సహజమైన ఆస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి రంధ్రాల్లో పేరుకున్న నూనె, దుమ్ముని తొలగిస్తుంది. జింక్ వల్ల యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉంది కాబట్టి ఎర్రగా వాచిన మొటిమలు తగ్గుతాయి. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎస్తెటిక్ డెర్మటాలజీ 2013 రిపోర్ట్ ప్రకారం రైస్ వాటర్ రెగ్యులర్ వాడకం వల్ల సెబమ్ ఉత్పత్తి 16% తగ్గింది.
  2. మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గింపు
    కోజిక్ యాసిడ్ బియ్యం పులిసినప్పుడు తయారవుతుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. అందుకే పాత మొటిమల మచ్చలు, సన్ ట్యాన్, డార్క్ స్పాట్స్ క్రమంగా లైట్ అవుతాయి. జపనీస్ మహిళలు “యు-సు-రు” అనే పులియబెట్టిన రైస్ వాటర్‌ని స్కిన్ బ్రైటెనింగ్ కోసం వాడతారు.
  3. ముఖం కాంతి, స్కిన్ టోన్ ఈవెన్ చేయడం
    విటమిన్ E, ఫెరులిక్ యాసిడ్ వల్ల డల్‌గా ఉన్న చర్మం కాంతివంతంగా మారుతుంది. బియ్యం నీళ్లు చర్మం pH బ్యాలెన్స్‌ని 5.5 దగ్గర ఉంచుతాయి. మన చర్మం న్యాచురల్ pH కూడా అదే. దీనివల్ల స్కిన్ బ్యారియర్ బలపడి గ్లో వస్తుంది.
  4. యాంటీ-ఏజింగ్ ఎఫెక్ట్
    ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ చర్మ కణాల రీజనరేషన్‌ని వేగవంతం చేస్తుంది. 2010లో జరిపిన ఒక స్టడీలో 28 రోజులు రైస్ వాటర్ వాడిన వారిలో ముడతలు 12.4% తగ్గినట్లు తేలింది. కొల్లాజెన్ బ్రేక్‌డౌన్‌ని నెమ్మదింప చేస్తుంది.
  5. సన్‌బర్న్, చర్మం మంటకు ఉపశమనం
    పులియబెట్టిన బియ్యం నీళ్లు చల్లగా ఉండి చర్మంపై మంటను తగ్గిస్తాయి. ఎండలో తిరిగి వచ్చాక ముఖం కందిపోతే రైస్ వాటర్‌తో కడిగితే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎగ్జిమా, ర్యాషెస్ ఉన్నవారికి కూడా ఉపశమనం.
  6. పోర్స్ టైటెనింగ్
    స్టార్చ్ వల్ల స్కిన్ టెంపరరీగా టైట్ అవుతుంది. దీంతో ఓపెన్ పోర్స్ చిన్నవిగా కనిపిస్తాయి. మేకప్ వేసుకునే ముందు రైస్ వాటర్ టోనర్‌లా వాడితే మేకప్ స్మూత్‌గా సెట్ అవుతుంది.

ఏ రకం బియ్యం నీళ్లు బెస్ట్?

natural skincare tips
  1. సాధారణ రైస్ వాటర్: బియ్యం 2-3 సార్లు కడిగిన నీళ్లు. తక్షణం వాడేయాలి. సెన్సిటివ్ స్కిన్‌కి మంచిది.
  2. బాయిల్డ్ రైస్ వాటర్: అన్నం వండిన గంజి. ఇందులో పోషకాలు ఎక్కువ. కానీ చిక్కగా ఉంటుంది కాబట్టి నీళ్లు కలిపి పల్చన చేయాలి.
  3. పులియబెట్టిన రైస్ వాటర్ : బెస్ట్ వెర్షన్ ఇదే. సాధారణ రైస్ వాటర్‌ని 24-48 గంటలు రూమ్ టెంపరేచర్‌లో ఉంచితే పులుస్తుంది. pH తగ్గి యాంటీ-ఆక్సిడెంట్లు పెరుగుతాయి. వాసన కొంచెం ఘాటుగా వస్తుంది కానీ ఫలితం 2 రెట్లు.

అయితే పులియబెట్టిన నీళ్లు 3 రోజులకు , ఫ్రిజ్‌లో పెడితే 5-7 రోజులు ఉంచొద్దని మించి నిపుణులు చెబుతున్నారు.

ఎలా వాడాలి?

natural skincare tips

ఫేస్ వాష్‌లా: ఉదయం, రాత్రి సాధారణ నీటికి బదులు బియ్యం నీటితో ముఖం కడుక్కోండి. 2 నిమిషాలు మసాజ్ చేసి కడిగేయండి.
టోనర్‌లా: దూదితో ముఖం అంతా అప్లై చేయండి. కడగక్కర్లేదు. దానిపైనే మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు.
ఫేస్ ప్యాక్: బియ్యం నీటిలో ముల్తానీ మట్టి లేదా శనగపిండి కలిపి 15 నిమిషాలు పెట్టుకోండి. మొటిమలకు బాగా పనిచేస్తుంది.
ఐస్ క్యూబ్స్: రైస్ వాటర్‌ని ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేయండి. ఉదయం ఒక క్యూబ్‌తో ముఖం రబ్ చేస్తే పఫీనెస్ తగ్గి ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది.

ఎవరు వాడకూడదు? జాగ్రత్తలు

natural skincare tips
  1. ఎగ్జిమా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు పులియబెట్టిన నీళ్లు వాడొద్దు. ఇన్‌ఫెక్షన్ పెరిగే ఛాన్స్.
  2. అతి పొడి చర్మం ఉన్నవారికి స్టార్చ్ వల్ల ఇంకా డ్రై అవ్వచ్చు. వాడిన వెంటనే మాయిశ్చరైజర్ తప్పనిసరి.
  3. ప్యాచ్ టెస్ట్: మొదటిసారి వాడేటప్పుడు చేతి మీద రాసి 24 గంటలు చూడండి. దురద, మంట వస్తే ఆపేయండి.
  4. బూజు వాసన వస్తే అస్సలు వాడొద్దు. బ్యాక్టీరియా పెరిగిందని అర్థం.

బియ్యం నీళ్లు vs మార్కెట్ ప్రొడక్ట్స్…

natural skincare tips

మార్కెట్‌ లో దొరికే కెమికల్ టోనర్ల ధర దాదాపు రూ. 300 నుంచి 2000 వరకు ఉంటాయి. అందే బియ్యం నీరు మన ఇంట్లో దొరుకుతుంది కాబట్టి రూపాయి ఖర్చు ఉండదు. కెమికల్ టోనర్లలో ఆల్కహాల్, పారాబెన్స్ ఉండొచ్చు. బియ్యం నీరు 100% సహజం, జీరో కెమికల్స్. కెమికల్స్‌ ద్వారా ఫలితం త్వరగా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. బియ్యం నీటితో ఫలితం నెమ్మదిగా, 3-4 వారాలు పడుతుంది.

ముఖానికి మాత్రమే కాదు..

natural skincare tips
  1. జుట్టుకి: రైస్ వాటర్‌తో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, షైనింగ్ వస్తుంది. యావో తెగ మహిళల జుట్టు రహస్యం ఇదే.
  2. మొక్కలకు: బియ్యం నీటిలో నత్రజని (N), భాస్వరం (P), పొటాషియం (K)ఉంటుంది. మొక్కలకు సహజ ఎరువు. వారానికి 2 సార్లు పోస్తే గ్రోత్ బాగుంటుంది.
  3. పాత్రలు తోమడానికి: స్టార్చ్ వల్ల జిడ్డు ఈజీగా వదులుతుంది. డిష్ సోప్ వాడకం తగ్గించవచ్చు.
  4. కాళ్ల పగుళ్లకు: గోరువెచ్చని రైస్ వాటర్‌లో 15 నిమి కాళ్లు పెడితే పగుళ్లు మెత్తబడతాయి.