ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి
ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి
- ఎండలో తిరిగి ఇబ్బందులు పడొద్దు
- 50మంది చిన్నారులకు సైకిల్స్ పంపిణీ
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణంలోని 50 మంది చిన్నారులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైకిల్స్ సోమవారం పంపిణీ చేశారు. వేసవి సెలవుల్లో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులకు సూచించారు. ఎండలో సైకిల్స్ తొక్కవద్దన్నారు. తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులకు విడతల వారీగా సైకిల్స్ పంపిణీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 320 సైకిల్స్ పంపిణీ పూర్తయ్యాయని తెలిపారు. మరో 600 సైకిల్స్ పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జార్జి మాథ్యూస్, చిద్రుప్ప రఘురాంగౌడ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.
