బీరప్ప కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా..
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఫసల్వాది గ్రామ శివారులో నిర్వహించిన బీరప్ప స్వామి-కామారతి కల్యాణ మహోత్సవంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సంప్రదాయ ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, చింతా సాయినాథ్, గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, శ్రవణ్‌రెడ్డి, వాజిత్, కౌన్సిలర్ సోము తదితరులు పాల్గొన్నారు.
