ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటి కుళాయి: ఎమ్మెల్యే రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రభ: పట్టణానికి ఏఐఐబీ పథకం ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటి కుళాయిని ఇస్తామని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏఐఐబీ పథకం అమలుపై రెండవ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసి త్వరితగతిన తాగునీరు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ పై ఉందని అందుకు అనుగుణంగా అధికారులు పనుల వేగం పెంచాలన్నారు. ఈ పనులు అమలు చేసే విషయంలో సంబంధిత రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. పనులు పురోగతిపై ప్రతి శనివారం సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
