land | భూమి అమ్మనివ్వడం లేదని రాస్తారోకో…
land | భూమి అమ్మనివ్వడం లేదని రాస్తారోకో…
land | జన్నారం, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్నప్పటికీ తమ భూమిని పక్క వారు అమ్మనివ్వడం లేదని మండలంలోని పొనకల్ సుందరయ్యనగర్ కాలనీకి చెందిన శనిగారపు మణికంఠ,సహారా, పలువురు కాలనీవాసులు సోమవారం సాయంత్రం రాస్తారోకో చేశారు.
తమ తండ్రి శనిగారపు మహేష్ ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని,చికిత్స కోసం అధిక డబ్బులు కావాలని తమ భూమి అమ్ముకుందామనుకుంటే పక్కనే ఉన్న ఇదే కాలనీకి చెందిన కామెర కవిత,కామెర యోగి,రాకేష్,అతని భార్య,అనూషలు భూమిని తాము అడిగిన ధరకు ఇవ్వాలని,ఇతరులకు అమ్మకుండా చేస్తూ భూమి కొన్న వారి చేతులు నరికేస్తామని నానా బూతులు తిట్టారని,వారిపై చర్య తీసుకోవాలని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.
