ఎమ్మెల్యే పుట్టినరోజు.. నోటుబుక్కుల పంపిణీ

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పుట్టినరోజును పురస్కరించుకొని,కంఠలి గ్రామ సర్పంచ్ మేత్రినాగనాథ్ గ్రామంలో గల ప్రభుత్వప్రాథమిక పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులంద్దరికీ నోటుబుక్కులను పంపిణీ చేశారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు కొద్దీ సమయంలోనే జుక్కల్ నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని,జుక్కల్ ప్రజలకు ఎల్లవేలాల్లో అందుబాటులో ఉండి,ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ,ప్రజాప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులకు అందే విధంగా ఎమ్మెల్యే తమవంతు కృషి చేస్తున్నారని,వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని సర్పంచ్ మేత్రి నగనాథ్ కోరుకున్నారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ యినందర్ కేర్బ్,ఉపాధ్యాయ బృందం,గ్రామపెద్దలు,యువకులు పాల్గొన్నారు.