చిరుత దాడిలో లేగదూడ మృతి

చిరుత దాడిలో లేగదూడ మృతి

  • కాజిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
  • చిరుత దాడిలో మృతి చెందిన లేగ దూడ

గుమ్మడిదల, ఆంధ్ర ప్రభ: జిన్నారం మండలం గడ్డపోతారం పురపాలక సంఘం పరిధిలోని కాజిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత దాడి చేసి లేగదూడను చంపింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం ప్రకారం కాజీ చెరువు సమీపంలో మేత మేస్తున్న లేగదూడపై చిరుత దాడి చేసింది. లేగదూడను చంపుతుండగా గొర్రెల కాపరి గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.

అనంతరం వారు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. కాజిపల్లి అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా చిరుత సంచారం ఉందని స్థానికులు తెలిపారు. మృతి చెందిన లేగదూడ కాజిపల్లి గ్రామానికి చెందిన గద్దె కృష్ణ అనే రైతుదిగా గుర్తించారు.

Leave a Reply