ఘనంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జన్మదిన వేడుకలు
శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
అవనిగడ్డ ఎంపీడీఓ మరియాదేవి, నాగాయలంక తహసీల్దార్ సీహెచ్. వీరాంజనేయులు, మోపిదేవి తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరనాథ్, నాగాయలంక ఎంపీడీఓ చంద్రశేఖర్ కార్యక్రమానికి హాజరయ్యారు.
విద్యుత్ శాఖ డీఈఈ నడకుదుటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏఈఈలు, ఎక్సైజ్ శాఖ సీఐ గిరిజ సత్యకుమారి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్, వైద్యులు పాల్గొన్నారు.
చల్లపల్లి, అవనిగడ్డ సీఐలు ఈశ్వరరావు, యువకుమార్, ఎస్సైలు శ్రీనివాస్, గౌతమ్ కుమార్, రాజేష్, చాణక్య ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అవనిగడ్డ పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు, అగ్నిమాపక శాఖ అధికారి ఎన్. సుధాకర్, సిబ్బంది, హాస్టల్ వార్డెన్లు, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
