BRS | జాతర ఘటనపై విచారణకు పిలుపు

BRS | జాతర ఘటనపై విచారణకు పిలుపు

BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సమ్మక్క సారక్క జాతరలో జరిగిన ఘటనకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

జనవరి 29న జరిగిన సమ్మక్క సారక్క జాతర సందర్భంగా చోటుచేసుకున్న వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసును తరువాత సీఐడీకి బదిలీ చేయడంతో, అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై సీఐడీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply